ఆ డైరెక్టర్ మాటల్లో మర్మమేంటో ఇప్పటికీ అర్థంకావట్లేదు : స్వరభాస్కర్

సోమవారం, 29 అక్టోబరు 2018 (12:10 IST)
ఓ దర్శకుడు వద్ద తనకు ఎదురైన అనుభవాన్ని బాలీవుడ్ నటి స్వరభాస్కర్ వెల్లడించింది. 'నువ్వు చాలా తెలివైన అమ్మాయిలా కనిపిస్తున్నావు.. మా సినిమాలో ఛాన్సివ్వలేను' అని ఆ దర్శకుడు చెప్పాడనీ, కానీ, ఆ దర్శకుడి మాటల్లో మర్మమేంటో ఇప్పటికీ అర్థంకాలేదని ఆమె చెప్పుకొచ్చింది. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, 'లుక్స్‌ బాగుండే హీరోయిన్స్‌కు మంచి అవకాశాలు వస్తుంటాయి. లేకపోతే ఏ హీరోయిన్‌ మేకప్‌ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టరు. కానీ, నేను ముంబైకి వచ్చిన కొత్తల్లో సినిమా చాన్స్‌ కోసం ఓ డైరెక్టర్‌ను కలిశాను. నువ్వు చాలా తెలివైన అమ్మాయిలా కనిపిస్తున్నావు.. మా సినిమాలో తీసుకోలేం' అని చెప్పారని తెలిపారు. 
 
సాధారణంగా సినిమాలోని పాత్రకు సరిపడ గ్లామర్‌ లేదు.. ఫేస్‌లో సరైన ఎక్స్‌ప్రెషన్స్‌ను చూపించడం లేదు... ఇలాంటి కారణాలతో హీరోయిన్స్‌ను రిజెక్ట్‌ చేస్తుంటారు కొందరు డైరెక్టర్లు. కానీ, తెలివైన అమ్మాయిలా కనిపించినందుకు ఓ సినిమా చాన్స్‌ను కోల్పోవడం తనకు ఎదురైన సంఘటన అని, దీన్ని తన జీవితాంతం మరచిపోలేనని ఆమె చెప్పుకొచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు