ఐటమ్ సాంగ్‌ల్లో నటించేందుకు అభ్యంతరం లేదు: తమన్నా

శుక్రవారం, 11 జనవరి 2019 (14:49 IST)
తనకు డ్యాన్సుల వల్లే ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, అందువల్ల ఐటమ్ సాంగుల్లో నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెల్లపిల్ల తమన్నా అంటోంది. 'హీరోయిన్‌గా ఒక చిత్రంలో నటించడంతో పాటు ఆ చిత్రంలోని పాటలకు అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్సులు చేయడం అంటే తనకు మహా ఇష్టమన్నారు. 
 
అయితే, నేటితరం హీరోయిన్లకు డ్యాన్స్‌లో ప్రతిభ చాటుకునే అవకాశాలు పెద్దగా రాలేదని, కానీ, తనకు మాత్రం అలాంటి అవకాశాలు అధికంగా వచ్చినట్టు చెప్పారు. అందుకే డ్యాన్సులకు ప్రాధాన్యం ఉండే స్పెషల్ సాంగుల్లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. 
 
కాగా, ప్రస్తుత హీరోయిన్లు సినిమాల్లో కంటే ఐటమ్ సాంగుల్లో నటించేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ఈ విషయంలో కాజల్ అగర్వాల్, శృతిహాసన్, తమన్నా, పూజా హెగ్డే, లక్ష్మీరాయ్, ఛార్మి వంటి వారు ఐటమ్ సాంగుల్లో కనిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు