మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం తేజ్ ఐ లవ్ యు. ఈ చిత్రానికి ఎ కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆడియో రిలీజ్ చేసారు. ఈ మూవీ టీజర్‌కి అనూహ్యమైన స్పందన రావడంతో సినిమాకి పాజిటివ్ టాక్ ఉంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న క్రియేటివ్ కమర్షియల్ అధినేత కె.ఎస్.రామారావు సినిమా విజయంపై పూర్తి నమ్మకంగా ఉన్నారు.
ఇక అసలు విషయానికి వస్తే... ఈ చిత్రాన్ని ఈ నెల 29న రిలీజ్ చేయాలి అనుకున్నారు. అఫిషియల్‌గా కూడా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు. మరి.. ఏమైందో ఏమో కానీ.. ఇప్పుడు రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యిందని సమాచారం. జులై 6న ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. తేజ్, కరుణాకరన్.. ఇద్దరికీ ఇప్పుడు సక్సస్ చాలా అవసరం. మరి.. అంచనాలను అందుకుని తేజ్ మూవీ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.