అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప 2ను సోమవారం ఏకాదశినాడు పూజా కార్యక్రమంతో శుభప్రదంగా ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించిన ఈ వేడుకకు దర్శక నిర్మాతల సభ్యులంతా హాజరయ్యారు.
Pupspa2 director, producers team
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విదేశాల్లో వుండడంతో రాలేకపోయారు. ఇప్పటికే దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ పుష్ప క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాకు సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే.
pupspa2 pooja
హీరోయిన్‌గా రష్మిక మందన్న సీక్వెల్‌లోనూ నటిస్తోంది. పుష్ప తో వచ్చిన క్రేజ్‌తో పుష్ప2ను ఓ రేంజ్‌లో అద్భుతంగా తెరకెక్కించనున్నారు. తగ్గేదేలె. అనే డైలాగ్‌తోపాటు పాటలు మంచి క్రేజ్ ఏర్పర్చుకున్నాయి. ఈసారి దేవీశ్రీప్రసాద్‌కు మరింత ఛాలెంజ్‌గా నిలవనుంది. నేడు లాంఛనంగా పూజతో ప్రారంభించిన ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభమవుతుంది.