ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ మాదాల నాగూర్ మాట్లాడుతూ, డైరెక్టర్ పీఎస్పీ శర్మతో కలిసి పనిచేయడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. రియల్ కోట ప్రాంగణంలోనే షూటింగ్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభమవుతాయి. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను ఖచ్చితంగా సంపాదించుకుంటుందని నమ్మకంగా చెబుతున్నాను” అన్నారు.
దర్శకుడు పీఎస్పీ శర్మ మాట్లాడుతూ –“స్టోరీ, స్క్రీన్ప్లే విషయంలో చాలా కష్టపడ్డాం. రచయిత ఎర్రా సంజీవరాజ్ ఈ కథను ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో అంశాలపై పరిశీలన చేసి, కథా మాటలు అందించారు. ఈ సినిమాలో గ్రాంథికతతో పాటు ప్రజెంట్ సిట్యూషన్స్కు అనుగుణంగా సన్నివేశాలు ఉంటాయి. నవరసాలతో పాటు వినూత్నత కలిగిన ఈ కౌలాస్ కోట చిత్రం విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం” అని అన్నారు.
నటీనటులు:దిల్ రమేష్, జబర్దస్త్ చంటి, జబర్దస్త్ వెంకీ, చిట్టిబాబు, లల్లి మధుమిత, టైగర్ బాబురావు, జనగామ రాజు, ఆర్టిస్ట్ శంకర్, కేరళ షాహెద్, కుమారి లక్ష్మీ, పీసుపాటి భరద్వాజ్, హరి మమత, మేఘమాల, బేబీ భవ్య తదితరులు.