వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు సంపాదించుకున్న తిరువీర్ కథానాయకుడిగా కొత్త సినిమా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. బై 7పి.ఎంప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో సందీప్ అగరం, అష్మితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. కమిటీ కుర్రోళ్ళు ఫేమ్ టీనా శ్రావ్య కథానాయిక. ముహూర్తం సన్నివేశానికి రానా దగ్గుబాటి క్లాప్ కొట్టగా, సందీప్ అగరం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రాహుల్ శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు.