`కళ్యాణం కమనీయం, ఒకటయ్యే వేళనా వైభోగం..` అంటూ పెళ్లికి పెళ్లికొడుకు, పెళ్లికూతురు సిద్ధమవుతున్న సందర్భంగా సాగే పాటను నటి సమంత శుక్రవారం 11 గంటలకు ట్విట్టర్ వేదికగా ఆవిష్కరించారు. విజయ్‌దేవర కొండ సమర్పిస్తున్న `పుష్పక విమానం` సినిమాలోనిది ఈ పాట. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను సిద్ధ్ శ్రీరామ్, మంగ్లీ బృందం ఆలపించారు. మ్యూజిక్: రామ్ మిరియాల, సిద్దార్థ్ సదాశివుని, అమిత్ దాసాని,\ నేపథ్య సంగీతం : మార్క్ కె.రాబిన్ సమకూర్చారు.