దర్శకుడు కోడి రామకృష్ణకు తీవ్ర అస్వస్థత

గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:41 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకుడు కోడి రామకృష్ణ. ఈయన గురువారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన ప్రస్తుతం అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. 
 
గతంలో పక్షవాతం బారినపడిన ఆయన త్వరగానే కోలుకున్నారు. కానీ, ఈ దఫా మాత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు లోనైనట్టు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. 
 
ఈయన హీరో బాలకృష్ణతో అనేక చిత్రాలు తీశారు. ముద్దుల కృష్ణయ్య, ముద్దులు మావయ్య, మువ్వా గోపాలు వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. పైగా, ఈయన నిర్మించిన పెక్కు చిత్రాలను ప్రముఖ నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి తన సొంత నిర్మాణ సంస్థ భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్‌పై నిర్మించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు