మూర్ఖులను అంత తేలిగ్గా తీసుకోవద్దు - హనీమూన్ మర్డర్‌పై కంగనా

ఠాగూర్

మంగళవారం, 10 జూన్ 2025 (20:15 IST)
ఎంతో సంతోషంగా తనతో భర్తతో కలిసి హనీమూన్‌కు వెళ్లిన భార్య... తన ప్రియుడు కోసం ఏకంగా కిరాయి మనుషులతో కట్టుకున్న భర్తను హత్య చేయడం అత్యంత హేయమైన చర్యగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎంపీగా ఉన్న కంగనా మేఘాలయా హానీమూన్ హత్యపై ఆమె స్పందిస్తూ, ఆమె విడాకులు తీసుకోలేకపోయింది. తన ప్రేమికుడితో పారిపోలేకపోయింది. ఎంత హేమయైన ప్రవర్తన ఇది. మూర్ఖులను ఎపుడూ తేలిగ్గా తీసుకోకూడదు. వారే సమాజానికి అత్యంత ప్రమాదకారులు. తెలివైన వ్యక్తులు తమ స్వార్థఁ కోసం ఇతరులను ఇబ్బంది కలిగిస్తారేమో గానీ తెలివితక్కువ వారు ఎలాంటి భయంకరమైన పనులకు పాల్పడుతారో ఊహించలేం. దయచేసి జాగ్రత్తగా ఉండండి అంటూ వ్యాఖ్యానించారు.
 
దీన్ని అవివేక చర్యగా ఆమె అభివర్ణించారు. కన్న తల్లిదండ్రులకు పెళ్లి ఇష్టం లేదని చెప్పడానికి భయపడిన ఒక మహిళ.. ఇంత క్రూరమైన హత్యకు పథకం వేసి సుపారీ ఇవ్వగలదా? ఉదయం నుంచి ఈ విషయం నా మనసును కలిచివేసోంది. నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. తలనొప్పిగానూ ఉంది అని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, మేఘాలయాకు హనీమూన్ కోసం వెళ్లి రాజ్ రఘువంశీ, సోనాలీ దంపతుల ప్రయాణం విషాదాంతంగా ముగిసిన విషయం తెల్సిందే. తన ప్రియుడుతో కలిసి కట్టుకున్న భర్తను భార్య హత్య చేసించింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు