వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'వంగవీటి' చిత్రంపై మొదటి నుంచీ అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా రామ్ గోపాల్ వర్మపై వంగవీటి రాధకృష్ణ మండిపడ్డారు. డబ్బు కోసం వంగవీటి జీవితచరిత్రను కించపర్చేలా చిత్రీకరించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. డబ్బు కావాలని అడిగితే రంగా అభిమానులు చందాలు వేసుకుని ముఖాన కొట్టేవాళ్లమన్నారు. వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి రాధ నివాళులర్పించారు.