"ఈశ్వర్" సినిమాతో తన కెరీర్ ను ఆరంభించిన ప్రభాస్ ఈ నెల 11 నాటికి కరెక్ట్ గా 20 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా "వర్షం" సినిమాను తమ నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ తరపున రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ తెలియజేశారు. ఇప్పటికే ఆన్ లైన్లో టిక్కెట్ల బుకింగ్ మొదలయ్యిందని, స్పీడ్ గా టిక్కెట్లు బుక్ అవుతూ, విశేష స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.
నట్టి కుమార్ విజ్ఞప్తి
తమ అభిమాన హీరోల సినిమాలను ప్రదర్శించే థియేటర్లను ఆయా హీరోల అభిమానులంతా దేవాలయాలు మాదిరిగా భావించి, వాటిని కాపాడుకోవాలని నట్టి కుమార్ విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రాంతాలలో సినిమాల విడుదల సందర్భంగా అభిమానుల కోలాహలంలో థియేటర్లు డామేజ్ అయిన సంఘటనలు జరిగాయని, దయచేసి అభిమానులు తమ కోలాహలాన్ని కొనసాగిస్తూనే, థియేటర్లను దేవాలయాలు మాదిరిగా కాపాడుకోవాలని నట్టి కుమార్ అందరు హీరోల అభిమానులకు పిలుపునిచ్చారు.