అంతర్జాతీయ వేదికల మీద తన పాటలు పడేందుకు తప్పనిసరిగా తన అనుమతి ఉండాల్సిందేనని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు.. మరో సంగీత దర్శకుడు, గాయకుడు ఇళయరాజా నోటీసులు పంపడం.. ప్రస్తుతం మ్యూజిక్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ నటుడు విశాల్ ప్రకటించారు.