నా జీవితాన్ని చూసి రత్నం లో డోంట్ వర్రీ రా చిచ్చా.. రాశాడనిపిస్తుంది : విశాల్

డీవీ

శనివారం, 16 మార్చి 2024 (09:35 IST)
Vishal - Director Hari and others
మాస్ యాక్షన్ హీరో, పురుచ్చి దళపతి విశాల్ యాక్షన్ డైరెక్టర్ హరితో ‘రత్నం’ అనే మూవీ రాబోతోంది. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్. ఈ మూవీలో విశాల్ కు జోడిగా ప్రియా భవానీ శంకర్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి  దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ను అందిస్తున్నారు.
 
రత్నం ఫస్ట్ షాట్ టీజర్‌, పాటలు ఇలా ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి పాటను రిలీజ్ చేశారు. కాలేజ్‌లో విద్యార్థుల మధ్య రిలీజ్ చేసిన ఈ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. పాటను రిలీజ్ చేసిన అనంతరం విశాల్ మాట్లాడుతూ.. ‘ఇలా కాలేజ్‌లో మా పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది. డోంట్ వర్రీ మచ్చి.. ఎగ్జామ్స్ కోసం డోంట్ వర్రీ మచ్చి.. కష్టాలు వస్తుంటాయ్ పోతుంటాయ్.. అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడు. ప్రతీ హీరోకి దేవీ శ్రీ ప్రసాద్‌ అదిరిపోయే పాట ఒకటి ఇస్తాడు. నాకు కూడా అలాంటి పాటను ఇవ్వమని అడిగాను. హరి నా జీవితాన్ని చూసి ఈ పాటను రాయించాడా? అని అనిపిస్తుంది’ అని అన్నారు.
 
శ్రీమణి రాసిన ఈ ‘డోంట్ వర్రీ రా చిచ్చా’ పాటను దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించాడు. దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బాణీ మంచి ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. రత్నం షూటింగ్ పూర్తయినట్టుగా మేకర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఏప్రిల్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకపై వరుసగా అప్డేట్లతో రత్నం టీం సందడి చేయనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు