Sunil setty, mohanbabu, vishnu
విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మోసగాళ్ళు. జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందించారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటి స్కామ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సోమవారం రాత్రి ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఎంతో గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకకు కలెక్షన్ కింగ్ డాక్టర్ మంచు మోహన్ బాబుతో పాటు చీఫ్ గెస్ట్ రానా దగ్గుబాటి, డైరెక్టర్ రానా, శ్రీనువైట్ల, సునీల్ శెట్టి, రాజారవీంద్ర, డైమండ్ రత్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, గాయని కోమలిని మోహన్ బాబు సత్కరించారు. మోసగాళ్లు బిగ్ టికెట్‌ను రానా లాంచ్ చేశారు.