ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో ఈ చిత్రానికి సంభందించిన థియేట్రీకల్ ట్రైలర్ విడుదల చేసారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి టి. ప్రసన్న కుమార్, నిర్మాత, పంపిణి దారుడు కరుణాకర్ రెడ్డి, ప్రముఖ పంపిణీదారుడు రాము, మార్కెటింగ్ ప్రొడ్యూసర్ బాలు పాల్గొన్నారు.
జై భజరంగి తెలుగు వెర్షన్ నిర్మాత నిరంజన్ పన్సారి మాట్లాడుతూ- " ఏడు నెలలక్రితం భజరంగి2 సినిమాకి సంబందించిన టీజర్ చూసాను. ఇంత భారీగా నిర్మించిన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా తప్పని సరిగా ఆదరిస్తారని గ్రహించి, గత 30 ఏళ్లుగా వీడియో రంగం లో వున్నా మా సంస్థ 'శ్రీ బాలాజీ వీడియో' ఒక మంచి చిత్రంతో నిర్మాణ రంగం లోకి ఎంటర్ అవ్వాలని 'జై భజరంగి' హై క్వాలిటీ చిత్రంతో శ్రీకారం చుట్టాము. ఈ చిత్రం మున్ముందు కూడా ఓటిటి లో విడుదలకాదు. కేవలం థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుంది. విజువల్ వండర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం థియేటర్లలో మాత్రమే చూడాల్సిన చిత్రం ఇంట్లో చిన్ని తెర పై చుస్తే ఆ అనుభూతి పొందలేరు. మీరు ముందు యూట్యూబ్ ఛానల్ లో మూడు నిమిషాల థియేట్రీకల్ ట్రైలర్ చూడండి అది నచ్చితేనే సినిమా చూడండి. " అన్నారు.
జర్నలిస్ట్ ప్రభు వ్యాఖ్యాత గా వ్యవహరించిన ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమం లో ఇంకా నిర్మాత పంపిణీదారుడు కరుణాకర్ రెడ్డి, మరో పంపిణీదారుడు రాము, మార్కెటింగ్ ప్రొడ్యూసర్ బాలు మాట్లాడారు.
నటీనటులు: డా. శివరాజ్ కుమార్, భావన మీనన్, శృతి, సౌరవ్ లోకేష్, శివరాజ్ కె ఆర్ పెటే తదితరులు.
సాంకేతిక బృందం.సంగీతం : అర్జున్ జన్య, సినిమాటోగ్రఫర్: స్వామి జె. గౌడ,ఎడిటర్: దీపు యస్ కుమార్,ఫైట్స్:డా. రవి వర్మ, విక్రమ్ మోర్, ఆర్ట్ డైరెక్టర్: రవి శాంతే హక్కులూ,మాటలు :ఏ. సెల్వమ్,ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ప్రేమ్ కుమార్, నిర్మాత: నిరంజన్ పన్సారి,కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: ఏ. హర్ష