పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

సిహెచ్

బుధవారం, 5 మార్చి 2025 (23:26 IST)
పుచ్చకాయ. ఈ పుచ్చకాయలు కాస్తంత పెద్దవిగా వుంటుంటాయి. వీటిని ఇంటికి తెచ్చుకుని సగం ముక్క కోసి మిగిలిన సగం ఫ్రిడ్జిలో పెట్టుకుని తర్వాత తిందాములే అనుకుంటారు. కానీ అలా పెడితే దానివల్ల పలు అనారోగ్య సమస్యలు రావచ్చంటున్నారు నిపుణులు. అవేమిటో తెలుసుకుందాము.
 
పుచ్చకాయను ఫ్రిడ్జిలో పెట్టడం వల్ల దానిలోని పోషక విలువలు తగ్గుతాయి.
ఫ్రిడ్జిలో పెట్టిన చల్లని పుచ్చకాయను తినడం వల్ల జలుబు, దగ్గు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
అదేవిధంగా థ్రోట్ ఇన్ఫెక్షన్, వదలని దగ్గు కూడా పట్టుకోవచ్చు.
ఫ్రిడ్జిలో వుంచిన పుచ్చకాయ తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
ఇంకా పొట్ట సంబంధిత సమస్యలు, జీర్ణ సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు.
చల్లని పుచ్చకాయలో వుండే బ్యాక్టీరియా పేగుకి హాని కలిగించవచ్చు.
గమనిక: ఈ సమచారం అవగాహన కోసం ఇవ్వబడింది. మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు