పప్పా నా వేలుకి దెబ్బ తగిలింది-అబ్ రామ్ చెప్పగానే.. షారూఖ్.. ఏం చేశాడంటే? (వీడియో)

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (16:47 IST)
బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన షారూఖ్ ఖాన్ బుల్లి కుమారుడు అబ్ రామ్ గురించే ప్రస్తుతం బాలీవుడ్ జనం మాట్లాడుకుంటున్నారు. షారూఖ్ ఖాన్ రయీస్ సినిమా ఇటీవలే రిలీజై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలోషారూఖ్ తన కూతురు సుహానా ఖాన్, కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో కలిసి తన ఇంట్లో ఇంటర్వూ ఇస్తోండగా మధ్యలో ఖాన్ లిటిల్ సన్ అబ్ రామ్ ఎంటరై కాసేపు సందడి చేశాడు. షారూఖ్, అబ్‌రామ్‌ల టాకింగ్‌కు సంబంధించిన క్యూట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
ఈ వీడియోలో ఇంటర్వ్యూ మధ్యలో ఎంటరైన అబ్ రామ్ షారూఖ్ దగ్గరకి వచ్చి తన బ్రొటన వ్రేలికి దెబ్బ తగిలిందంటూ చూపించాడు. పప్పా నా వేలుకి దెబ్బ తగిలింది అంటూ షారూఖ్‌కి చూపించడంతో వెంటనే ఇంటర్యూలో ఉన్న విషయం కూడా మరచి పోయి షారూఖ్ డాడి మూడ్ లోకి వెళ్ళిపోయాడు. అబ్ రామ్ థంబ్‌కి కిస్ ఇచ్చి.. ఇప్పుడు తగ్గిందా అంటూ అడిగాడు. ఆ తర్వాత తన ఫ్యాన్స్‌కి ఆడియన్స్‌కి బై అని అబ్ రామ్‌చే చెప్పించాడు షారూఖ్ ఖాన్.
 
ఇకపోతే.. షారూఖ్ ఖాన్ నటించిన రయీస్ సినిమా జనవరి 25న విడుదలైంది. మహీరా ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన రయీస్ చిత్రం ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియో మీరూ చూడండి.

SRK & AbRam pic.twitter.com/6WS3r3eBgg

— KKKG|TUMBLR (@KKKG_TUMBLR) January 29, 2017

వెబ్దునియా పై చదవండి