ఓటీటీలోకి అమిగోస్ వచ్చేసింది... నెట్‌ఫ్లిక్స్‌లో ఎయిర్‌టెల్ సేవలతో ఫ్రీ
శనివారం, 1 ఏప్రియల్ 2023 (19:07 IST)
Amigos
ఓటీటీలోకి అమిగోస్ వచ్చేసింది. ప్రయోగాలకు పెద్ద పీఠ వేసే కల్యాణ్ రామ్ సినిమా ఓటీటీలోకి రానుంది. చాలా కాలం తర్వాత బింబిసారతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న కళ్యాణ్‌రామ్ అదే జోష్‌తో గతేడాది అమిగోస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
అయితే ఈ సినిమా కాస్త కలెక్షన్ల విషయంలో వెనకబడింది. అయితే కళ్యాణ్‌రామ్ నటనకు మాత్రం వందకు వంద మార్కులు పడ్డాయి. ఇందులో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేశాడు.
కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో గత అర్థరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అశికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది.
ఇక పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌తో Netflixలో Amigos మూవీని చూడవచ్చు. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లేకపోతే, వివిధ ఎయిర్‌టెల్ ప్లాన్‌లు, సేవలతో పూర్తి సినిమాని ఉచితంగా చూడవచ్చు.