అక్కినేని నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లికి సంబంధించిన విశేషాలను తెలిపాడు. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు మంచి స్పందన రావడంతో సినీ యూనిట్ పండగ చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో చైతూ మాట్లాడుతూ.. ఈ ఏడాది అక్టోబరులోనే తన పెళ్లి జరుగుతుందని స్పష్టం చేశాడు. ఇక తమ వివాహం విదేశాల్లో జరుగుతుందని ప్రచారం సాగుతోంది. హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం సమంతతో తన వివాహం మనదేశంలోనే జరుగుతుందని స్పష్టం చేశాడు. సమంత తన అభిరుచుల్ని గమనించి తనను ప్రోత్సహిస్తుందని చెప్పాడు.
తాను కూడా సమంత అభిరుచుల విషయంలో అలాగే ఉంటానని తెలిపాడు. సమంత ఓ అల్లరి చేసే మంచి అమ్మాయి అని ఆమెకు కాబోయే భర్త చైతూ సర్టిఫికేట్ ఇచ్చేశాడు. ఏడేళ్ల తమ స్నేహంలో ఒకరి నొకరు బాగా అర్థం చేసుకున్నామని.. తమ స్నేహం, ప్రేమ అన్నీ తీపిగుర్తులు మదిలో నిలిచిపోయాయని చైతూ చెప్పుకొచ్చాడు. రారండోయ్ అంటూ ఇప్పటివరకు సినిమా కోసం పిలిచామని, ఇక తన పెళ్లి వేడుక కోసం పిలుస్తామని అన్నాడు.