సిక్స్ ప్యాక్ హీరో నితిన్, "అందాల ఖజానా" ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోన్న "రెచ్చిపో" చిత్రం త్వరలో తెరపైకి రానుంది.
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ "అడవి" చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోన్న నితిన్‌కు "రెచ్చిపో" మంచి గుర్తింపును సంపాదించి పెడుతుందని చిత్ర దర్శకుడు పరుచూరి మురళి అంటున్నారు.
గల్ఫ్ ప్రాంతంలో కీలక సన్నివేశాల చిత్రీకరణతో శరవేగంగా షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు చెప్పారు. జి.వి.రమణ నిర్మాణ సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి ఇలియానా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తాయని పరుచూరి తెలిపారు.
ప్రస్తుతం "రెచ్చిపో" సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అద్భుతమైన ప్రేమకథా నేపథ్యంలో యూత్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని నిర్మాత వెల్లడించారు.
మరోవైపు "రెచ్చిపో"లో ఇలియానా, నితిన్‌లపై పలు రొమాంటిక్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయని ఫిలిమ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తానికి ఇందులో ఇలియానా అందాలను ఆరబోసిందని.. నితిన్‌తో నటనలోనూ రెచ్చిపోయిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్.