నవంబర్‌‌లో 'అజ్ఞాతం'... కళ్యాణి ఎక్స్‌టార్డినరీ ప్రదర్శన

మంగళవారం, 16 అక్టోబరు 2012 (14:27 IST)
WD
యువ దర్శకుడు శ్రీధర్‌ పోకూరు కథా దర్శకత్వాన ప్రముఖ నటి కళ్యాణి ప్రధాన పాత్రధారిణిగా నిర్మాతలు ఎస్‌.వి. సుబ్బారావు, ఎన్‌. సుధీర్‌కుమార్‌రెడ్డిలు సంయుక్తంగా శ్రీకమలాలయ ప్రొడక్షన్స్‌ పతాకంపైన నిర్మించిన 'అజ్ఞాతం' సెన్సార్‌ కార్యక్రమాలను ముగించుకుని నవంబర్‌ మొదటివారంలో విడుదలకు సిద్ధమైంది.

కథకుడు, దర్శకుడు అయిన శ్రీధర్‌ పోకూరు సినిమా గురించి చెబుతూ- ''ఈనాడు సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలను మా చిత్రంలో కళ్ళకుకట్టినట్లుగా చూపించడం జరిగింది. హీరోయిన్‌ కళ్యాణి ఇందులో ప్రధాన పాత్రను అద్భుతంగా చేశారు. ఆమె నటనకు మంచి పేరు వస్తుందని గట్టి నమ్మకం మాకుంది.

నేటి సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అన్యాయాలను చూసి తట్టుకోలేని ఇద్దరు అమ్మాయిలు కలిసి న్యాయం కోసం జరిపిన పోరాటంలో ఏం జరిగింది? అనేదే ఈ చిత్ర ఇతివృత్తం. సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఈ కథద్వారా చెప్పడం జరిగింది. సందేశంతోపాటు పూర్తి కమర్షియల్‌ విలువలతో వినోదం నేపథ్యంలో ఈ చిత్రముంటుంది. ఈమధ్యనే సెన్సార్‌ పూర్తిచేశాం. మా నిర్మాతలు నవంబర్‌ మొదటివారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు'' అన్నారు

చిత్ర నిర్మాతలు ఎస్‌.వి. సుబ్బారావు, ఎన్‌.సుధీర్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ- తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి మేము అజ్ఞాతం చిత్రద్వారా కాలుపెట్టాం. మా దర్శకుడు శ్రీధర్‌ పోకూరు చక్కని సందేశాత్మకంతో కూడిన వినోదం ఆద్యంతం సాగే ఆసక్తికరమైన సన్నివేశాలను మేళవించి దీన్ని మలిచారు. ఫస్ట్‌టైమ్‌ నిర్మాతలుగా వచ్చిన మేము ఓ మంచి సినిమాను చేశామని తృప్తికల్గింది. నవంబర్‌లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం'' అన్నారు.

కళ్యాణి ప్రధాన పాత్రపోషించిన ఈ చిత్రంలో సుబ్బరాజు, కృష్ణభగవాన్‌, జీవా, తనికెళ్లభరణి, ఎం.ఎస్‌.నారాయణ, బెనర్జీ, ప్రభాకర్‌, చిట్టిబాబు, పొట్టి రాంబాబు, జయవాణి, తస్లీమాషేక్‌, శ్వేతాశర్మ మున్నగువారు ఇతర పాత్రలుపోషించారు.

ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చిన్ని చరణ్‌, పాటలు, సంగీతం సదివే దేవెంద్ర, ఛాయాగ్రహణం జి.ఎస్‌.రావు, ఎడిటింగ్‌ నందమూరి హరి ముఖ్యసాంకేతిక నిపుణులు.. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కె.ఎ.ఆర్‌. ప్రసాద్‌, ఎం.కె.రావు, నిర్మాతలు. ఎస్‌.వి. సుబ్బారావు, ఎన్‌.సుధీర్‌కుమార్‌రెడ్డి, కథ,మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీధర్‌ పోకూరు.

వెబ్దునియా పై చదవండి