నెలాఖరులో జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా

"సబ్ కా మాలిక్ ఏక్ హై" అంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పి, కులమతాలు వేర్వేరుగా లేవని, మనిషి- కులం ఒకటేనని, మానవత్వమే మతమని చాటిచెప్పిన షిర్డీ సాయిబాబా నిజ జీవిత వృత్తాంతానికి దృశ్యరూపం జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా చిత్రమని దర్శకుడు జి. రామకృష్ణ తెలిపారు.

ఎస్ఆర్ఆర్ క్రియేషన్స్ పతాకంపై బి.వి. రెడ్డి టైటిల్ పాత్ర పోషించిన చిత్రమిది. సాయిబాబా నిజ జీవితంలో జరిగిన అనేకానేక సంఘటనలను వైవిధ్యంగా చిత్రీకరించామని ఆయన చెప్పారు. ప్రేక్షకులు, బాబా భక్తులు. తప్పకుండా తమ చిత్రాన్ని ఆదరిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో సుమన్, నారాయణరావు, నాగబాబు, శివకృష్ణ, బ్రహ్మాజీ, రమాప్రభ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: కొమ్మనాపల్లి గణపతి రావు, పాటలు: సుద్దాల అశోక్ తేజ, నిర్మాత: బి.వి. రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గూడ రమేష్

వెబ్దునియా పై చదవండి