రవితేజ చిత్రాలంటేనే ఎనర్జిటిక్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగుతూ వెటకారపు మాటల్తో ప్రేక్షకుల్ని మైమరిపిస్తాడు. అదే కోవలోనే ఆంజనేయులు ప్రయత్నించాడు. కిక్ సినిమా తర్వాత వెంటనే అదే తరహాలో చేసిన ఆంజనేయులులో రవితేజ నటన రొటీన్‌గానే ఉన్నా తల్లిదండ్రుల సెంటిమెంట్‌ను తగిలించాడు. బహుశా ఈ చిత్రంలోనే తొలిసారిగా రవితేజ ఏడ్చిన సన్నివేశాలున్నాయోమో. ఇది పూర్తిగా హీరోబేస్డ్ సినిమా.
ప్రతి చిత్రంలోనూ అల్లరిగా ఆటపట్టించే వ్యక్తిత్వంగల రవితేజ క్యారెక్టర్ ఆంజనేయుల్లోనూ ఉంటుంది. ఆంజనేయులు (రవితేజ) హెచ్.ఎం.టీవీ ఛానల్‌లో రిపోర్టర్. కెమెరామెన్‌గా బ్రహ్మాజీ. క్రియేటివ్ హెడ్ బ్రహ్మానందం. మొబైల్ కంపెనీలో అంజలి (నయనతార) పనిచేస్తుంది. ఓ సందర్భంలో పరిచయమై మొదటిచూపులోనే ఆమె ప్రేమలో పడతాడు ఆంజనేయులు.
ఇక వృత్తిపరంగా సిటీలో మాఫియా లీడర్ బడా (సోనూసూద్) వ్యవహారాల్ని గమనిస్తుంటాడు ఆంజనేయులు. ఆ క్రమంలో బస్ ప్రమాదంలో అందరూ చనిపోయిన ఉదంతం వెనుక బడాతోపాటు పలువురు రాజకీయనాయకులు, అధికారులు ఉన్న విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత బడా మాఫియా గ్యాంగ్‌లో పవన్‌గా పేరు మార్చుకుని అక్కడ విషయాలన్నీ రాబట్టుకుంటాడు. (ఇదంతా పోకిరి సినిమా ఎపిసోడ్‌లా ఉంటుంది). చివరగా బడాను అతను వెనుక ఉన్నవారిని ఎలా శిక్షించాడు అన్నది మిగిలిన సినిమా.
రవితేజ ఎనర్జిటింగ్‌పైనే సినిమా అంతా నడుస్తుంది. భావోద్వేగాన్ని చక్కగా కనబరిచాడు. రిపోర్టర్‌గా వృత్తి ధర్మాన్ని ఎంత జోవియల్‌గా నిర్వర్తించాలో చక్కగా చూపాడు. కొన్ని సన్నివేశాల్లో మాత్రం రవితేజ మొహం పీక్కుపోయినట్లుగా కన్పిస్తుంది. ఇక నయనతార విషయంలోనూ అదే. గత చిత్రాల్లో ఉన్న గ్లామర్ ఈ చిత్రంలో కనిపించలేదు. మేకప్ వేసుకోవడం మరిచిపోయిందా.. అనిపిస్తుంది. పెర్‌ఫార్మెన్స్‌కు ఏ మాత్రం అవకాశంలేని పాత్ర. హీరోకు హీరోయిన్‌గా మాత్రమే ఉంటుంది.
WD
బ్రహ్మానందం క్రియేటివ్‌హెడ్ ప్రభాకర్‌గా నటించాడు. అతని అసిస్టెంట్‌గా రవితేజ కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు గిలిగింతలు పెట్టిస్తాయి. (ఈటీవీ మాజీ ప్రభాకర్, సుమన్‌లను ఉద్దేశించిన సన్నివేశాలు గుర్తుకువస్తాయి.) ఏ విషయంలోనూ పక్కవారు చెప్పింది వినే రకం కాదు. అంతా తానే క్రియేటివ్ చేస్తాననే అహం ఉన్న పాత్ర అది. శ్రీనివాసరెడ్డి పాత్ర అసిస్టెంట్‌గా మాత్రమే.
బ్రహ్మాజీ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా నటించాడు. జయప్రకాష్‌రెడ్డి, దండపాణి, కోటశ్రీనివాసరావు పాత్రలు దేశాన్ని దోచుకునే పాత్రల్లాంటివి. జయప్రకాష్ (ప్రకాష్‌రాజ్) పాత్ర ఐ.ఎ.ఎస్. అధికారి నుంచి రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ ఇమడలేక బయటపడేపాత్ర. లోక్‌సత్తా నాయకుడ్ని ఉద్దేశించినట్లుంటుంది. రాజారవీంద్ర విలన్‌గా నటించాడు. ఒక్కనాకొక్క కొడుకుపై తండ్రి ప్రేమంటే ఎలా ఉంటుందో నాజర్ పాత్ర చూపించాడు.
టెక్నికల్‌గా చూస్తే... గ్రాఫిక్స్‌కి కూడా పని తగిలింది. హీరో విలన్‌లు యాక్షన్ సన్నివేశాలు పోకిరి తరహాలో ఉంటాయి. ఆకాశంలో ఎగరడాలు... అక్కడే ఫైట్ చేయడాలు.. వంటివి చూస్తే లాజిక్‌గా అనిపించవుగానీ మాస్‌ను బాగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం పర్వాలేదు. రెండే పాటలు బాగున్నాయి. 'నా మనసు..' అనే పాట వినసొంపుగా ఉంది. సంభాషణలపరంగా.. ఎవరు ఎవరికి జీవితాంతం తోడుగా ఉండరంటూ.. తండ్రి కొడుకుతో అనే సన్నివేశం హృద్యంగా ఉంది.
దర్శకుడు పరశురామ్ కథ నడకను చాలా స్పీడ్‌గా తీసుకెళ్ళేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. దానికి రవితేజ స్పీడ్‌డైలాగ్‌లు, యాక్షన్ సరిపోయింది. బ్రహ్మానందం కామెడీ కాస్త ఊరట. మొదటి భాగం ఎంటర్‌టైన్‌గా సాగుతూ రెండోభాగంలో కాస్త సెంటిమెంట్‌ను టచ్‌చేశాడు. సీరియస్ సన్నివేశంలో వచ్చే పాటలు చిత్రానికి ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయాయి. కిమ్‌శర్మ క్లబ్‌సాంగ్ ఏమీ బాగోలేదు.
'యువత' చిత్రాన్ని తీసిన పరశురామ్ సెకండాఫ్‌లో పూరీజగన్నాథ్ బాటలోనే వెళ్లాడనిపిస్తుంది. విలన్ గ్యాంగ్‌లో ఆంజనేయులు చేరే సన్నివేశం బాగుంది. ఉద్రేకంతో చేసే ఫైట్లు మోతాదుకు మించింది. టోటల్‌గా మాస్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హైదరాబాద్‌లో కిక్, ఆంజేయులు సేమ్ కాంప్లెక్స్‌లో ఆడడంకూడా ఒకరకంగా వెరైటీ. రాష్ట్రంలో కొన్ని థియేటర్లలోనే అలాగే జరిగింది. ఒకప్పుడు కృష్ణ చిత్రాలు పక్కపక్క థియేటర్లలో ఆడేవి. మరి ఈ ఆంజనేయులు ఎంతమేరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడో చూడాల్సిందే.