బాలాకోట్ దాడి, ఆపరేషన్ సిందూర్ మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. అయితే.. వీటిని దాయాది పాకిస్థాన్ పసిగట్టడంలో విఫలమైంది. మోడీ వ్యూహాలను అంచనా వేయడంలో వెనుకబడింది. పాక్ దృష్టి మరల్చి దెబ్బకొట్టడంలో భారత ప్రధాని మోడీ మరోసారి పైచేయి సాధించారు. దీంతో దాయాది ఏమరపాటుగా ఉన్న వేళ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది.
భారత జలాలను ఇక నుంచి దేశం దాటనివ్వబోమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల కోసమే వాటిని వినియోగిస్తామని తేల్చి చెప్పారు. దాదాపు 30 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో.. ప్రధాని ముఖంలో ఎక్కడా ఆందోళన కనిపించలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన కల్పించే మాక్ డ్రిల్స్‌ను అంతకుముందు ప్రకటించారు.