గతం లోకి తీస్కెళ్ళే అన్నపూర్ణ ఫోటో స్టూడియో- రివ్యూ

శుక్రవారం, 21 జులై 2023 (11:36 IST)
Annapurna Photo Studio
చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు.
 
 అన్నపూర్ణ ఫొటో స్టూడియో చిత్రం విలేజ్ నేపథ్యం. 1980లో బెల్ బాటమ్ ఫాంట్ లు, ఓణీలు వేసుకునే స్వచ్ఛమైన మనుషుల కథ. ఇప్పటి పెద్దలు అప్పటి వాతావరణంలోకి తొంగి చూసే విధంగా ఉన్నటుంది అని దర్శక నిర్మాతలు చెబుతూ వచ్చారు. కొత్తవారితో దర్శక నిర్మాతలు చేసిన ఈ సినిమా జులై 21న అనగా ఈరోజే విడుద అయింది.  ఆ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
ఓ గ్రామంలో చంటి (చైతన్యరావ్‌) కొండపై నుంచి ఆత్మహత్య చేస్కుని రోడ్డుమీద వెళుతున్న పోలీస్ జీప్ పై పడిపోతాడు. షాక్ గురయి ఎస్.ఐ.  ఆసుపత్రిలో జాయిన్‌ చేస్తారు. చంటి జేబులో  సూసైడ్‌ నోట్‌ను చదివే క్రమంలో కథ సాగుతుంది. ఆ ఊరిలో కాలేజీ పూర్తి చేసి ఉద్యోగం రాక తన తల్లిపేరుతో అన్నపూర్ణ ఫొటోస్టూడియోను నడుపుతుంటాడు. ఊరిలో దేనికైనా చంటి దిక్కు. ఓసారి సైకిల్‌ పందెంలో పొల్గొన్న చంటి ఎదురుగా  సైకిల్‌పై వస్తున్న లావణ్యను ఢీ కొడతాడు. దాంతో తొలిచూపుతోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్ని నాటకేయ పరిణామాలతో ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ వీరి ప్రేమ తెలిసిన చంటి తండ్రి  లావణ్య ను పిలిచి చంటికి గండం ఉంది. అందుకే పెళ్లి మానుకో అని చెపుతాడు. అప్పటికే వయసులో చాలా తేడా ఉన్నా  లావణ్య బాగా ఇష్టపడంతో సీక్రెట్ గా తాళి కట్టించుకుంది. ఆ తర్వాత చంటి  ఓ మర్డర్ కేసులో ఇరుకుంటాడు. ఆతర్వాత ఏమైంది అన్నది మిగిలిన  కథ. 
 
విశ్లేషణ:
 30 వెడ్స్ 21 అనే వెబ్ సిరీస్ లో పౌపులర్ అయిన (చైతన్యరావ్‌ ఇందులోనూ ఏజ్ తేడా ప్రేమ కథతో నటించాడు. 80వ దశంలో కథ కాబట్టి దానికి తగినట్లు చక్కటి గ్రామాన్ని ఎంపికచేసుకున్నాడు దర్శకుడు. గతంలో పెద్ద వంశీచిత్రాలు  వచ్చాయి. గ్యాప్‌ చాలా వుండడంతో ఆ తరహాలో దర్శకుడు చెందు వెళ్ళాడు. ఇందులో హీరోకు వయస్సు వచ్చినా పెండ్లికాదు అనే పాయింట్‌ సరికొత్తగా అనిపిస్తుంది. అలా ఎందుకనేది ముగింపు దాకా తీసుకువచ్చి సస్పెన్స్‌లో పెట్టాడు దర్శకుడు. హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్‌ ట్రాక్‌, సన్నివేశాలు చాలా సరదాగా ఎంటర్‌టైన్‌ ఇస్తాయి. హీరోయిన్‌ను చూడగానే రంగమ్మ అనే సాంగ్‌ రావడం చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. కానీ అది పూర్తినిడివి సాంగ్‌లేకపోవడంతో కొంత ఆడియన్స్‌కు నిరాశ కలిగిస్తుంది. ఇద్దరూ కొత్తవారు కావడం అప్పుడే చిగురించిన పువ్వులా లావణ్య పాత్ర అందంగా వుంటుంది. వయస్సుమీద పడినా హీరో పాత్రకు యూత్‌ బాగా కనెక్ట్‌ అవుతారు. వారి నటన స్వచ్చంగా వుంది. వారితోపాటు వారి స్నేహితులుకూడా బాగా నటించారు.
 
మొదటి భాగం చాలా సరదాగా సాగుతూ ఇంటర్‌వెల్‌ ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు, పాత్రలు బాగున్నాయి. జగదీష్‌ పాత్రను నిర్మాత యష్‌ రంగినేని పోషించారు. కాలేజీలో విద్యార్థుల మధ్య సాగే ఫైట్‌ రియలస్టిక్‌గా వుంది. ఈ కథను హీరో రాసిన సూసైడ్‌ నోట్‌ను చదువుతూ పోలీసులు చెప్పడంతో ఒకస్థాయిలో చికాకు పుట్టిస్తుంది. అన్నిసార్లు కాకుండా రెండు, మూడు సార్లు అయితే బాగుండేదనిపిస్తుంది. ఇక ఇందులో నటించిన మిగిలిన నటీనటులు బాగానే చేశారు. 
 
ప్రిన్స్‌ హెన్రీ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం సన్నివేశపరంగా పొందికగా చేశాడు. పంకజ్‌ సినిమాటోగ్రఫీ సినిమాకు కీలకం. ప్రతి సన్నివేశాన్ని ఓ ఆర్ట్‌లా చూపించాడు. ఎస్‌.పి. చరణ్‌ పాడిన రంగమ్మ సాంగ్‌ బాగుంది. ఎడిటింగ్‌ ఓకే. చిన్నపాటి లోపాలున్నా కథకు దర్శకుడు చెందు సరైన న్యాయం చేశాడు. ఇలాంటి గ్రామీణ మట్టివాసన కథలు ఇతర భాషల్లో బాగానే ఆదరణ పొందుతున్నాయి. అందుకే రొటీన్‌ కథ కాకుండా కాస్త భిన్నమైన అంశాన్ని ఎంచుకుని వల్గారిటీకి తావులేకుండా దర్శక నిర్మాతలు చేసిన ప్రయత్నం అభినందనీయం. ఇప్పటి తరం మూలాలు కూడా గ్రామీణం అని తెలుసుకుని సినిమా చుస్తే ఆదరణ పొందుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు