సందేశాత్మ‌క చిత్రంగా మిషన్ 2020

శుక్రవారం, 29 అక్టోబరు 2021 (20:45 IST)
Mission 2020 poster
నటీనటులు: నవీన్ చంద్ర, నాగ బాబు, జయ ప్రకాష్, స్వాతి, తదితరులు
 
సాంకేతిక‌తః కెమెరాః వెంకట్ ప్రసాద్, సంగీత దర్శకుడు: ర్యాప్ రాక్ షకీల్, ఎడిటర్: ఎస్ బి ఉద్ధవ్, నిర్మాతలు: కుంట్లూర్ వెంకటేష్ గౌడ్, కె వి ఎస్ ఎస్ ఎల్ రమేష్ రాజు, దర్శకుడు: కరణం బాబ్జి
 
 
“మిషన్ 2020” పేరుతోనే నేర‌ప‌రిశోధ‌న క‌థ అని తెలిసిపోతుంది. ఇలాంటి చాలా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేస్తాయి. అందుకు క‌థ‌, క‌థ‌నం స‌రైన‌విధంగా వుంటే ఆ త‌ర‌హా అభిమానులు ఆద‌ర‌ణ చూర‌గొంటుంది. నవీన్ చంద్ర హీరోగా చేయ‌డంతో ఓ క్రేజ్ ఏర్ప‌డింది. ఈ రోజే విడుద‌లైన‌ ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
 
కథ :
 
జయంత్ (నవీన్ చంద్ర) స్ట్రిక్ట్  పోలీస్ ఆఫీసర్. త‌ప్పు చేసిన‌వాడెవ‌డైనా స‌రై ఎన్‌కౌంట‌ర్ చేసే ద‌మ్ము వున్న అధికారి. ఇంకోవైపు న‌లుగురు కాలేజీ స్నేహితులు. చ‌దువులో ఎంత ఫ‌స్టో. ఓ వ్య‌స‌నంతో లాస్ట్‌కు దిగ‌జారిపోతారు. అందుకు కార‌ణం నీలి చిత్రాలు చూసి కాలాన్ని వృధా చేసుకోవ‌డ‌మే. దాని ప్ర‌భావం స్నేహితురాలిని అత్యాచారం చేసే దిశ‌గా సాగుతుంది. దీంతో వారి పేర్లు మ‌రింత మారుమోగిపోతాయి. వీరి కేసును జ‌యంత్ టేక‌ప్ చేస్తాడు. ఆ త‌ర్వాత ఏమి జ‌రిగింది? అనేది మిగిలిన క‌థ‌. 
 
విశ్లేష‌ణః
 
ద‌ర్శ‌కుడు తీసుకున్న అంశం నేటి యువ‌త ఫేస్ చేసేది. వ‌య‌స్సుతో సంబంధంలేకుండా స్కూల్ పిల్ల‌లు కూడా నీలి చిత్రాలు చూస్తూ చిన్న పిల్ల‌ల‌ని సైతం హ‌త్యాచారం చేసి సంఘ‌ట‌న‌లు చాలానే వున్నాయి. ఇటీవ‌లే ఆరేల్ళ అమ్మాయిని ఆ నీలి చిత్రాలు చూడ‌మంటూ బ‌ల‌వంతం చేసిన ఘ‌ట‌న ఇటీవ‌లే పేప‌ర్ల‌లోకూడా వ‌చ్చింది. అందుకే స‌మాజిక అంశంతో కూడిన ఈ పాయింట్‌ను ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎంచుకున్నారు. ఈ కథాంశంతో వచ్చిన ఈ సినిమా సందేశం పరంగా మాత్రం నిజంగా స్ఫూర్తినిచ్చే సినిమానే.
 
యువ‌త జీవితం అనేది కెరీర్ ప‌రంగా వ‌య‌స్సులో ఎద‌గాలి. అది కాకుండా సున్నిత‌మైన అంశంతో గాడి త‌ప్పారా వారి జీవితాలు ఎలా వుంటాయ‌నేది ఇందులో చూపించారు. చుట్టూ ఉన్న పరిస్థితులను, జనం ఆలోచనా విధానాన్ని హైలైట్ చేస్తూ చెప్పడం కూడా బాగుంది.  నవీన్ చంద్ర తన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన కీలక పాత్రల్లో నటించిన నాగ బాబు, జయ ప్రకాష్, సత్య ప్రకాష్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అదే విధంగా ఇతర కీలక పాత్రల్లో నటించిన సమీర్, చలాకి చంటి, మరియు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పించారు.
 
కానీ ఇలాంటి క‌థ‌ను మ‌రింత ప‌గ‌డ్బంధీగా క‌థ‌నం రాసుకుంటే వేరే లెవ‌ల్లో సినిమా వుండేది.త‌ను రాసుకున్న కొన్ని సీన్లు ఆక‌ట్టుకున్నాయి. ఆ క్ర‌మంలో క‌థ నెమ్మ‌దిగా సాగేట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్‌ హాఫ్  సీన్లతో  సాగతీత సన్నివేశాలతో కాస్త నెమ్మ‌దిస్తుంది. 
 
అయితే  సెకండ్ హాఫ్ లో నైనా ఇంకాస్త శ్ర‌ద్ధ పెట్టాల్సింది. ప్రధాన పాత్రల క్యారెక్టరైజేషన్స్  ఆ పాత్రల సంఘర్షణ నమ్మశక్యంగా సినిమాటిక్‌గా మార్చేశాడు. దాంతో ప్రధాన పాత్రలు పేల‌వంగా అనిపిస్తాయి. మెయిన్ గా స్వాతి పాత్రలోని పెయిన్ తో పాటు ఆమె క్యారెక్టర్ లోని ఆర్క్ అండ్ మోటివ్ ను ఇంకా బలంగా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. కొందరు నటీనటుల హావభావాలు, వారి నటన ద‌ర్శ‌కుడు రాబ‌ట్టుకోలేక‌పోయార‌నే చెప్పాలి. ఇలాంటి క‌థ‌లు చాలా ఆస‌క్తిక‌రంగా వుంటేనే ప్రేక్ష‌కులు ఇన్‌వాల్వ్ అవుతారు. ఆ దిశ‌గా ఇంకాస్త క‌స‌ర‌త్తు చేయాల్సింది. ఏది ఏమైనా ఓ సందేశాత్మ‌క క‌థ‌ను వెండితెర‌పై ఆవిష్క‌రించాల‌నే త‌ప‌న ద‌ర్శ‌క నిర్మాత‌ల్లో క‌నిపించింది. కెమెరామెన్ వెంకట్ ప్రసాద్ పనితనం మాత్రం ఆకట్టుకుంది. విజువల్స్, మరియు కొన్ని షాట్స్ చాలా బాగున్నాయి. ర్యాప్ రాక్ షకీల్ అందించిన సంగీతం ఫర్వాలేదనిపిస్తుం నిర్మాణ విలువ‌లు బాగానే వున్నాయి. ఇలాంటి క‌థ‌ల్లో ట్విస్ట్‌లు ఆస‌క్తిక‌రంగా వుండాలి. ఆ దిశ‌గా క‌థ‌ను రాసుకుంటే మ‌రింత ఆకట్టుకునేది.
 
రేటింగ్ః 2.5/5

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు