అభి-ఐష్‌లకు పెళ్లిరోజు శుభాకాంక్షలు

IFM
బాలీవుడ్ చిలకాగోరింకలు అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యారాయ్‌లకు పెళ్లై నేటి (మంగళవారం- ఏప్రిల్ 21)తో రెండు సంవత్సరాలైంది. అమితాబచ్చన్ కుమారుడైన అభిషేక్‌కు, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌కు రెండేళ్ల క్రితం ఇదే తేదీన వివాహమైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అభి-ఐష్‌లు తమ పెళ్లిరోజును హ్యాపీగా గడుపుకుంటున్నారట.

గత ఏడాది మియామీలో తమ పెళ్లిరోజును వైభవంగా జరుపుకున్న ఈ జంట, ఈ సంవత్సరం, తరుణ్ మనుష్కాని తాజా చిత్రం "దోస్తానా" షూటింగ్ స్పాట్‌లో జరుపుకోనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా ఉంటోన్న ఈ దంపతులకు పెళ్లిరోజును కూడా హాయిగా గడుపుకునేందుకు టైం లేదట.

ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమా "రావణ్"లో అభి-ఐష్‌లు నటిస్తున్నారు. ప్రస్తుతం యూరోపియన్ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ స్పాట్‌లోనే అభి-ఐష్‌ల పెళ్లిరోజును ఘనంగా జరుపుకోనున్నట్లు సినీ వర్గాల సమాచారం.

ఐశ్వర్యారాయ్ బయోగ్రఫీ:
పుట్టినరోజు: 01-11-1973
వయస్సు: 36 సంవత్సరాలు
వృత్తి: మోడల్, నటీమణి
జన్మస్థలం: మంగళూరు, కర్ణాటక.

అభిషేక్ బచ్చన్ బయోగ్రఫీ:
పుట్టినరోజు: 05-02-1976
వయస్సు: 33
వృత్తి: నటుడు
జన్మస్థలం: మహారాష్ట్ర.

వెబ్దునియా పై చదవండి