పవర్ స్టార్ పవన్ కల్యాణ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్తే సరేసరి లేకుంటే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వుంటుందని రాధాకృష్ణ హెచ్చరించారు.
పవన్ తన వ్యక్తిగత, రాజకీయ లోపాలను కప్పిపుచ్చుకునేందుకే తనపై ఉద్దేశపూర్వకంగా ట్వీట్లు చేస్తున్నారని ఆర్కే విమర్శించారు. పవన్ చేసే ఆరోపణల్లో నిజం లేదని.. పవన్ ఆరోపిస్తున్నట్టు టీఆర్పీ కోసం మహిళలను దూషించే అలవాటు తమకు లేదని, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి వార్తా సంస్థలు నియంత్రణ సంస్థలకు లోబడి పనిచేస్తాయని స్పష్టం చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించిన పవన్.. చేసిన ట్వీట్లపై వివరణ ఇచ్చి బహిరంగంగా, రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని రాధాకృష్ణ హెచ్చరించారు.