ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలతో ముంబై నగర వాసుల జనజీవనం అస్తవ్యస్తమైంది. అనేక లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇదిలావుంటే ఈ వర్షాల ధాటికి అంథేరీ ప్రాంతంలోని ఓ రైల్వే వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మరోవైపు, ఈ ప్రమాదం కారణంగా ఈస్ట్ వెస్ట్ ప్రాంతాలకు వెళ్లే అన్ని రకాల రైలు సేవలను నిలిపివేశారు. అలాగే, కూలిన వంతెన వద్ద భారీ సంఖ్యలో రైల్వే పోలీసులతో పాటు అగ్నిమాపకదళ సిబ్బందిని నియమించారు.
మరోవైపు ముంబై భారీ వర్షాలకు అనేక లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ముఖ్యంగా, శ్యాం తలావ్, హింద్ మట, ఒబేరాయ్ మాల్, సీఎస్టీ రోడ్డు, కుర్లా, మాహిమ్ జంక్షన్, నెహ్రూనగర్ బ్రిడ్జి, శాంతాక్రజ్, చెంబూర్ లింక్ రోడ్డు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. ఈ నీటిని తొలగించే పనుల్లో ముంబై కార్పొరేషన్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు.