కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లెహ్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ ఆయన గురువారం జమ్మూకాశ్మీర్ అంశంపై మాట్లాడారు. జమ్మూకాశ్మీర్, లడాఖ్ ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగమన్నారు. కాశ్మీర్‌పై పాకిస్థాన్‌కు ఎటువంటి అధికారం లేదన్నారు. ఉగ్రదాడులతో భారత్‌ను నిర్వీర్యం చేస్తున్న పాక్‌తో ఎలా శాంతి చర్చలు నిర్వహిస్తామని ప్రశ్నించారు.
పాకిస్థాన్‌తో మంచి స్నేహసంబంధాలు కోరుకుంటున్నామన్నారు. కానీ దాని కన్నా ముందు ఉగ్రవాదులను ఉసిగొల్పడం పాక్ మానుకోవాలన్నారు. పాకిస్థాన్‌ను ఒకటి అడగాలనుకుంటున్నాను, కాశ్మీర్ ఎప్పుడు పాక్‌లో భాగమన్నారు. మరోవైపు, గుజరాత్ తీరంలోకి పాక్ కమాండోలు ప్రవేశించనున్నారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఆ రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించారు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతం నుంచి వాళ్లు భారత భూభాగంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
మతఘర్షణలు సృష్టించేందుకు లేదా ఉగ్రదాడులు చేసేందుకు పాక్ కమాండోలు ప్లానేసినట్లు తెలుస్తోంది. గుజరాత్‌కు చెందిన అదానీ పోర్టు ఓ హెచ్చరిక ప్రకటన జారీ చేసింది. హరామీ నాలా ప్రాంతం నుంచి గల్ఫ్ ఆఫ్ కచ్‌లోకి పాక్ శిక్షిత కమాండోలు ప్రవేశించిన తమకు సమాచారం అందిందని అదాని పోర్టు పేర్కొన్నది. ముంద్రా పోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. గుజరాత్ రాష్ట్రావ్యాప్తంగా కూడా భారీ పటిష్టతను ఏర్పాటు చేస్తున్నారు.