రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్, ఆనాడు ఎన్టీఆర్‌ను కుర్చీ నుంచి కూలదోసారు: ప్లీనరీలో కేసీఆర్

బుధవారం, 27 ఏప్రియల్ 2022 (17:56 IST)
ఫోటో కర్టెసి-ట్విట్టర్
తెరాస ప్లీనరీలో ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసారు. వాటిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలను ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

 
పూజ్యులు ఎన్టీఆర్ గారు నిష్కల్మషమైన మనసుతో పార్టీ పెట్టి 200 సీట్లతో అధికారంలోకి వస్తే.. గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఆయనను పదవి నుంచి దించేసారని చెప్పుకొచ్చారు. ఐతే తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తిరిగి ఆయనకు పట్టం కట్టారన్నారు.

 

టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా హైటెక్స్ లో జరిగిన ప్లీనరీ సమావేశంలో దేశ విస్తృత ప్రయోజనాలరీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @KTRTRS.#21YearsOfTRS pic.twitter.com/B4u8bdraG2

— TRS Party (@trspartyonline) April 27, 2022

టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి పెట్ట‌ని కోట‌. ఎవ‌రూ కూడా బ‌ద్ద‌లు కొట్ట‌లేని కంచుకోట.. ఈ పార్టీ యావ‌త్తు తెలంగాణ ప్ర‌జ‌ల ఆస్తి. ఒక వ్య‌క్తిదో, శ‌క్తిదో కాదు. అనుక్ష‌ణం తెలంగాణ రాష్ట్రాన్ని, ప్ర‌జ‌ల‌ను, ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించే కాప‌లాదారు : పార్టీ అధినేత, సీఎం కేసీఆర్. pic.twitter.com/2HGuF1KQeY

— TRS Party (@trspartyonline) April 27, 2022
ఆ దెబ్బతో అవమానకర రీతిలో గవర్నర్ ఇక్కడి నుంచి వెళ్లిపోయారంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితలే వున్నాయంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో క్యాబినెట్ 12 మంది ఎమ్మెల్సీలకు ఆమోదం తెలిపి పంపితే దాన్ని అలాగే తొక్కి పట్టి వుంచారన్నారు. తమిళనాడులో కూడా అసెంబ్లీ పంపిన బిల్లులు ఇలాగే వున్నాయన్నారు. గవర్నర్ల వ్యవస్థను ఇలా మార్చేసి ప్రభుత్వాలపై ఉపయోగిస్తున్నారనీ, గతంలో జరిగిన పరిణామాలను చూసైనా పరిణతి సాధించాలంటూ హితవు పలికారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు