ఈ వివరాలను పరిశీలిస్తే, ముజఫర్ నగర్‌కు చెందిన దంపతులకు పిల్లలు లేరు. దీంతో భార్య అనుమతితో భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి మొదటి భార్యను భర్త పట్టించుకోవడం మానేశాడు. దీంతో మొదటి భార్య ఆగ్రహానికి గురైంది. ఆ కోపంతోనే ఆమె భర్త మర్మాంగాలను కోసేసింది. చాలా విషమ పరిస్థితుల్లో అతన్ని హాస్పటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.