గత కొన్ని రోజులుగా సౌతాఫ్రికా దేశంలో నమోదయ్యే రోజువారి కరోనా కేసుల సంఖ్య పెరిగింది. అయితే, గత బుధవారం ఒక్క రోజే 1200 కేసులు నమోదుకాగా, గురువారం ఈ సంఖ్య రెట్టింపు అయింది. అంటే 2465 కేసులు నమోదయ్యాయి. పైగా, మరణాల సంఖ్య కూడా అనూహ్యంగా ఆరు రెట్లు పెరిగింది.
అదేసమయంలో ఈ వైరస్ డెల్టా వైరస్ కంటే అత్యంత ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు. ముఖ్యంగా, కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ సమయాల్లో ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లలోని స్పైక్ ప్రోటీన్లలో రెండు, మూడు ఉత్పరివర్తనాలే ప్రమాదకరమైనవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు.