ఇందుకుగాను ప్రతి గ్రామంలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నిరంతరాయంగా ఇంటర్నెట్ సేవలు అందేట్లు, అందుకుగాను అవసరమైన బ్యాండ్ విడ్తుతో కనెక్షన్లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే యువతు ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు అవసరమైన సౌకర్యాలను డిజిటల్ లైబ్రరీల ద్వారా అందేట్లు చూడాలన్నారు.
జనవరి నాటికి 4,530 డిజిటల్ లైబ్రరీలు సిద్ధమవుతాయనీ, రాష్ట్రంలో మొత్తం 12,979 పంచాయతీల్లో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.