అమెరికా రాష్ట్రంలోని ఉటాహ్ రాష్ట్రంలోని స్మిత్‌ఫీల్డ్‌లో హేడన్ గాడ్‌ఫ్రే చదువుతున్నాడు. వాలెంటైన్ డేకు మూడు రోజుల ముందే మొత్తం 900 ఫ్లవర్స్‌తో స్కూల్‌కు వచ్చాడు. ఆ స్కూళ్లో ఉన్న అమ్మాయిలందరికీ గులాబీలు ఇచ్చి వాలెంటైన్ డే శుభాకాంక్షలు చెప్పాడు. దాదాపు 20 రోజుల ముందే ఆన్‌లైన్‌లో పువ్వల కోసం గాడ్‌ఫ్రే ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ సహాయంతో వాటిని గిఫ్ట్‌లుగా రూపొందించాడు. గురువారం ఆ పువ్వులను ట్రక్కులో తరలించి స్కూళ్లో ఉన్న అమ్మాయిలందిరికీ వాలెంటైన్ డే గిఫ్ట్‌గా ఇచ్చేశాడు. గాడ్‌ఫ్రే ఇచ్చిన గులాబీ పువ్వులు అమ్మాయిలను ఎంతగానో ఆకర్షించింది.