గృహావరణలో మెట్ల నిర్మాణం ఎలా ఉండాలి?

సోమవారం, 12 మే 2014 (16:29 IST)
File
FILE
సాధారణంగా గృహ నిర్మాణంలో మెట్ల నిర్మాణంపై అనేక సందేహాలు ఉత్పన్నమవుతుంటాయి. ఇలాంటి సందేహాలపై వాస్తు నిపుణులను స్పందిస్తూ.. మెట్లను నిర్మించటంలో కొన్ని పద్ధతులను పాటించాలని వాస్తు శాస్త్రాలు వెల్లడిస్తున్నాయని చెపుతున్నారు.

మేడపైకి మెట్లు నిర్మించేటపుడు ఒక వరుస మెట్లను... తూర్పు నుంచి పడమరకు లేదా, ఉత్తరం నుంచి దక్షిణానికి ఎక్కే విధంగా నిర్మించాలి. రెండు వరుసలుగా నిర్మించేటపుడు.. మొదటి వరుస మెట్లను.. తూర్పు నుంచి పడమరకు వెళ్ళే విధంగానూ, రెండో వరుస మెట్లు ఏ దిక్కుకైనా తిరిగినా పడమర నుంచి తూర్పుకు ఎక్కే విధంగా నిర్మించాలి.

రెండు వరుస మెట్లను నిర్మించేటపుడు ఒక వరుస ఉత్తరం నుంచి దక్షిణం వైపు ఎక్కేవిధంగానూ, రెండో వరుస.. ఎటు తిరిగినా దక్షిణం నుంచి ఉత్తరం ఎక్కేవిధంగా నిర్మించుకోవచ్చు. ఈశాన్య దిక్కుగా మెట్లను నిర్మించేటప్పుడు గృహానికి తూర్పు, ఈశాన్యం లేదా ఉత్తర - ఈశాన్యాలవైపు నిర్మించుకోవచ్చు.

ఈశాన్యం వైపు నిర్మించే మెట్లు ప్రహరీ గోడకు సమీపంలో ఉండకూడదు. మెట్లను ఎల్‌ ఆకారంలో ఉండే విధంగా నిర్మించాలనుకునే వారు ముందు తూర్పు నుంచి పడమరకు గానీ, లేదా ఉత్తరం నుంచి దక్షిణానికి గానీ ఎటువైపుకైనా నిర్మించుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి