చాలా మంది పడక గదులకు బాల్కనీలను నిర్మించుకోవాలని భావిస్తున్నారు. వాస్తు నియమాలు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోని వారు ఈ పడక గదులకు బాల్కనీలు నిర్మిస్తుంటారు. అసలు పడక గదులకు బాల్కనీలు నిర్మించుకోవచ్చా. ఇది వాస్తుపరంగా అనుకూలమేనా అనే అంశాలను పరిశీలిస్తే..
పడక గదులకు బాల్కనీలు నిర్మించుకునే విషయంలో చాలా జాగ్రత్త వహించాలని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు. దూరంగా ఉండేటువంటి ప్రదేశాలను చూడడం కోసం ఈ ఆధునిక నిర్మాణాల విధానంలో చాలామంది బాల్కనీలు పడక గదులకు ఏర్పాటు చేసి, ఆ బాల్కనీలో కూర్చుని ఎంజాయ్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారన్నారు.
అయితే, వారి ఆలోచన బాగానే ఉన్నప్పటికీ.. ప్రతి ఇంటికి ఒక ముఖం, ఒక వీపు ఉంటాయి. ముఖం వైపే కళ్లు, ముక్కు, నోరు, చెవులు ఇలా శరీరంలోనూ అమరి ఉంటాయి. ఒక ఉచ్ఛమైన దిశ, ఒక నీచమైన దిశ ఉంటాయి. అలాంటి విధానాలతోనే వాస్తు శాస్త్రం కూడా ఉంది.
బాల్కనీ ఎటు ఏర్పాటు చేయాలి, ఏ విధంగా ఉండాలి అనే దానికి ఒక నియమం ఉంది. తూర్పువైపు విశాలమైన వాతావరణాన్ని ఇవ్వడానికి సానుకూలంగా ఉంటాయి. పడమర వైపు బాల్కనీ కన్నా తూర్పు వైపు ఎక్కువ ఉండేలా బాల్కనీ ఏర్పాటు చేసుకోవాలి. కేవలం నైరుతి గదికి మాత్రమే పశ్చిమంలోనూ దక్షిణంలోనూ బాల్కనీ ఏర్పాటు చేసుకుని అక్కడ ఒక ద్వారం పెట్టుకొని ఆ బాల్కనీలో కూర్చోవడం సరైనది కాదని వాస్తు నిపుణులు అంటున్నారు.