నైరుతి భాగంలో ఉండాల్సిన నిర్మాణాలు

స్థలానికి పశ్చిమ, దక్షిణ వీధులుంటే ఆ స్థలాన్ని నైరుతి బ్లాక్ అంటారని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. పశ్చిమంలో ఉండు వీధి దక్షిణం నుంచి ఉత్తరానికి పల్లంగానూ, దక్షిణం వీధి- పశ్చిమం నుండి తూర్పునకు పల్లంగానూ ఉంటే మంచిది. నైరుతి బ్లాక్-నైరుతి మూలకన్నా ఆగ్నేయం మూల పల్లంగానూ, ఆగ్నేయం మూల కన్నా వాయవ్య మూల పల్లంగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడు ఈశాన్యమూల అన్నిటికన్నా పల్లంగా ఉండటం మంచిది.

ఇలాంటి స్థలంతో మంచి ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. నైరుతిలో ఖాళీ స్థలము వదిలి గృహనిర్మాణం చేయకూడదు. నైరుతి దిశలో రాళ్లగుట్టలు, ఉంటే శుభములు కలుగుతాయి. నైరుతి దిశలో వరండాలు ఉండకూడదు. కరెంట్ మీటర్లు నైరుతిలో ఉండకూడదు. ఇంటి స్లాబ్ నైరుతిలో అన్నిటికన్నా ఎత్తుగా ఉండుట శుభం. గ్యారేజీలు, పార్కింగ్‌లు నైరుతిలో ఉంటే శుభములు కలుగును. భారీ పరిశ్రమలలలో భారీయంత్రములను నైరుతి భాగములో ఏర్పాటు చేయుట శుభదాయకమగును.

గోబర్ గ్యాస్ ప్లాంట్స్ నైరుతి భాగములో నిర్మించకూడదు. నైరుతిలో బరువైన సామాన్లు, వస్తువులు బీరువాలు పెట్టవచ్చును. గృహ యజమాని నైరుతి గదిలో ఉండవలెను. నైరుతి సింహద్వారమునకు ఎదురుగా వీధిపోటు ఉండకూడదు. వాస్తు ప్రకారం నైరుతి దోషాలు ఏ మాత్రం లేని గృహం ధన,ధాన్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతుందని, శుభకార్యాలు జరుగుతాయని జ్యోతిష్కులు పేర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి