ఉగ్రవాదులకు స్వర్గభూమిగా ఉన్న పాకిస్థాన్ దేశంలో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదిని గుర్తు తెలియని సాయుధులు కాల్చి చంపేశారు. ఉగ్రవాది పేరు రజావుల్లా నిజామనీ అలియాస్ అబు సైఫుల్లా. పాకిస్థాన్ సింధ్ ప్రావీన్స్‌లో గుర్తు తెలియని సాయుధుల చేతిలో హతమైనట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
పాకిస్థాన్ ప్రభుత్వ భద్రత కలిగిన ఉగ్రవాదుల్లో సైఫుల్లా ఒకరు. మట్లీలోని తన నివాసం నుంచి ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లాడు. ఓ చౌరస్తాకు చేరుకున్న అతడిపై సాయుధులు దాడి చేసి హతమార్చారు.
2006లో నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో అబు సైఫుల్లా ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. 2001లో రాంపూర్‌లోని సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై, 2005లో బెంగుళూరులోని ఐఐఎస్‌సీపై జరిగిన దాడుల్లో ఈ ఉగ్రవాది ప్రమేయం ఉంది.