మా ఇంటికి ప్రహరీ గోడలేదు.. నిర్మించాలా?

FILE
ఇంటికి నాలుగు పక్కలా ప్రహరీ గోడ తప్పకుండా నిర్మించాలి. ఒక దిక్కులో ప్రహరీ గోడ నిర్మించి మిగిలిన దిక్కులలో ప్రహరీగోడ నిర్మించకుండా వదిలెయ్యడం మంచిది కాదు. తప్పకుండా ప్రహరీగోడ నిర్మించండని వాస్తు నిపుణులు అంటున్నారు. దీనివలన స్థలం హద్దులు కూడా తెలుస్తాయి.

సాధారణంగా ఇంటికి నాలుగు దిక్కులా కొంత ఖాళీ స్థలాన్ని వదిలి, ప్రహరీ గోడ నిర్మించాలి. ఈశాన్యానికి ఎదురుగా ఉండేదే నైరుతి. ఇతర మూలల కంటే నైరుతి మూలలో ఖాళీ స్థలం మెరకగా ఉండాలి. నైరుతిలో బావి లేదా సంపు బొత్తిగా ఉండకూడదు. గొయ్యి కానీ పల్లంగా కానీ ఉండకూడదు. కొంత ఎత్తుకు లేపి మెరకగా ఉండేట్లు చూసుకోవాలి. పల్లెటూళ్లలో ఇప్పటికీ నైరుతిలో చుట్టిల్లు వేస్తూ ఉంటారు. ఇలా వేయడం అన్నివిధాలా శ్రేయస్కరం.

వెబ్దునియా పై చదవండి