అవిసె గింజలు స్త్రీలకు జుట్టు, చర్మానికి సహాయపడటమే కాకుండా పీరియడ్స్ క్రమబద్ధీకరిస్తాయి. దీని ప్రయోజనాల్లో బరువు తగ్గడం కూడా ఉన్నాయి. ఇందులో ఒమేగా కొవ్వులు, ఫైబర్ వుండటం వల్ల సంతృప్త విలువను అందిస్తాయి.
అందుచేత మహిళలు ప్రతిరోజూ 2 టీస్పూన్ల అవిసె గింజలను తీసుకోవాలి. అవిసె గింజలను ఎండబెట్టి పొడి చేసుకుని వాడుకోవచ్చు. ప్రతిరోజూ వివిధ ఆహారాలతో పాటు తినవచ్చు. లేదా చపాతీ, దోస పిండిలో కలుపుకోవచ్చు. ఇడ్లీ, దోసెలకు పొడి మసాలాగా ఉపయోగించవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.