రోజుకు ఓసారైన టీ తాగాలి. వేడి టీ కండరాల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అల్లం టీ, పెప్పర్ టీ, లావెండర్ టీ, గ్రీన్ టీ, యాలకుల టీ, లెమన్ గ్రాస్ టీ, హెర్బల్ టీ ఏది తాగినా ఆ సమయంలో మంచిదే.
రోజూ కనీసం ఆరు నుండి ఎనిమిది గ్లాసులు నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగడం వలన ఆ సమయంలో నొప్పి నుండి సాంత్వన పొందుతారు. అల్లం బహిష్టు నొప్పిని తగ్గిస్తుంది. బహిష్టులు సక్రమంగా వచ్చేట్టు చేస్తుంది. అల్లాన్ని మెత్తగా తురిమి కప్పు నీళ్లలో 5 నిమిషాలు పాటు మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని వడగట్టి అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే నొప్పి తగ్గుతుంది. బహిష్టు సమయంలో ఈ టీ ని రోజుకు మూడుసార్లు తాగితే కడుపునొప్పి, ఇతర బాధలు తగ్గుతాయి. వేడినీళ్ల బ్యాగును ఉపయోగిస్తే కూడా బహిష్టు నొప్పి తగ్గుతుంది.