భాజపా అధికారంలో వుంటే మహిళలకు భద్రత కరువా? నెటిజన్లు మొదలెట్టారు...

బుధవారం, 1 మార్చి 2017 (19:33 IST)
ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకోబోతున్న నేపధ్యంలో సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, హింసాత్మక ఘటనలపై చర్చ నడుస్తోంది. ఓ నెటిజన్ స్పందిస్తూ... మహిళలపై జరుగుతున్న దాడుల్లో సగానికి పైగా టీనేజ్ అమ్మాయిలే వుంటున్నారనీ, భాజపా అధికారంలో వున్నంత కాలం ఈ దారుణాలు జరుగుతూనే వుంటాయని పేర్కొంది. 
 
మరోవైపు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రోజూ 11 మంది స్త్రీలు అత్యాచారాలకు గురవుతున్నారనీ, ప్రతివారం ఆరుగురు మహిళలు సామూహిక అత్యాచారానికి గురవుతున్నారంటూ ఓ ప్రముఖ దినపత్రిక పేర్కొంది. ఇప్పుడు ఈ గణాంకాలు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. విషయం ఏమంటే... దీనిపై చర్చిస్తూనే #womensday, #JanDhan అనే ట్యాగ్ లైన్లను జోడించడం. మరి ఈ లెక్కలపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో?

వెబ్దునియా పై చదవండి