ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆ తర్వాత ఎవరికి వారు తమ పార్టీ గెలుస్తుందని అంటే.. కాదు తమ పార్టీ గెలుస్తుందని మరికొందరు అంటున్నారు. మొత్తంమీద గెలుపుఓటములు అనేవి అధికార టీడీపీ, విపక్ష వైకాపాల మధ్యే ఉండనుంది. మూడో పార్టీగా ఎన్నికల గోదాలోకి దిగిన జనసేన మాత్రం అధికారంలోకి వచ్చే సూచనలు ఏమాత్రం లేవు. కానీ, ఈ పార్టీ ప్రభావం ఇతర పార్టీలపై ఏ మేరకు పడపోతుందన్న అంశంపైనే ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి నగిరి ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే.రోజాకు చెల్లెలు వంటింది. ఈ విషయాన్ని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా. అయితే, ఎన్నికల ఫలితాలకు మరో నెల రోజులకు పైగా వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గెలుపోటములపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
అయితే, మిగిలిన అభ్యర్థుల గెలుపోటములు ఎలా ఉన్నా... నగరిలో మాత్రం తాను మాత్రం విజయభేరీ మోగిస్తానని వైకాపా అభ్యర్థి, సినీ నటి ఆర్కే.రోజా గట్టిగా ధీమాను వ్యక్తం చేస్తోంది. అంతేనా.. పార్టీ గెలువడంతో పాటు తనకు మంత్రి పదవి కూడా దక్కుతుందని ఆమె కోటి ఆశలు పెట్టుకున్నారు.