పవన్ కళ్యాణ్ పిలిస్తే వెళ్లిపోతా .. : అనసూయ

వరుణ్

గురువారం, 28 మార్చి 2024 (07:53 IST)
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల ప్రచారం చేసేందుకు పలువురు సినీ నటులు ప్రచారం చేసేందుకు సిద్ధమైపోతున్నారు. ఇలాంటి వారిలో అనసూయ ఒకరు. జనసేనాని పవన్ కళ్యాణ్ పిలిస్తే తాను ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. నాయకుల అజెండాలు నచ్చితే మద్దతు ఇస్తానని ఆమె తెలిపారు. తన మాట వినేవాళ్లు కొందరు ఉండటం తన అదృష్టమన్నారు. పవన్ కళ్యాణ్ పిలిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రచారానికి వెళ్తానని, అందుకోసం తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. 
 
ఇకపోతే, జబర్దస్త్ కార్యక్రమాన్ని తాను మానేయడంపై ఆమె స్పందిస్తూ, డేట్స్ కుదరకపోవడం వల్లే తాను ఈ కార్యక్రమాన్ని మానేశానని చెప్పారు. తనకు సమయం ఉన్నపుడల్లా సెట్స్‌కు వెళుతుంటానని తెలిపారు. గతంలో సీనియర్ నటుడు కోటా శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలపై అనసూయ స్పందిస్తూ, ఆయన కొంచెం పాతకాలం నాటి మనిషి కాబట్టే తన డ్రెస్సింగ్ స్టైల్‌ నచ్చలేదని చెప్పారు. తనపై ఆయనకు చాలా చనువు ఉందని, అందుకే పొట్టి దుస్తులు వేసుకోవడం ఆయనకు ఏమాత్రం నచ్చలేదన్నారు. దీన్ని అవకాశఁగా తీసుకుని కొంతమంది రకరకాలుగా వార్తలు రాశారని మండిపడ్డారు. కోటగారు తనను ఇంట్లో మనిషిగా భావించారు కాబట్టే అలా అన్నారని అనసూయ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు