Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

దేవీ

శనివారం, 2 ఆగస్టు 2025 (19:55 IST)
Niharika Konidala
తాజాగా సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా  నీహారిక కొణిదల ముస్తాబైంది. చీర మ్యాజిక్ దేశీ ఎలిగెన్స్ టైమ్‌లెస్ బ్యూటీ ఇండియన్ ఈస్తటిక్స్ కల్చరల్ వైబ్స్ అంటూ కాప్షన్ లతో ఆమె తనను తాను ప్రమోట్ చేసుకుంటుంది. ఇదేమీ పెండ్లి డ్రెస్ లా వుండడంతో రకరకాలవార్తలు సోషల్ మీడియాలో వుంటుండగా, ఇదేదో యాడ్ కోసం చేసినట్లుగా అనిపిస్తుంది.
 
నాగబాబు కుమార్తెగా అందరికీ పరిచయమైన నీహారిక ఇంతకుముందు హీరోయిన్ గా కొద్ది సినిమాలలో నటించింది. ఆ తర్వాత పెండ్లి చేసుకుని వ్యక్తిగత కారణాలతో విడిపోయింది. అప్పటినుంచి బాధ్యతగా చిత్ర నిర్మాణ రంగంలో ప్రవేశించి సక్సెస్ సినిమాలు తీస్తుంది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా నిహారికాకు మంచి క్రేజ్ వచ్చింది. నిహారిక చేసిన షార్ట్ ఫిలిమ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
 
మొదట్లో నాగశౌర్య హీరోగా ఒక మనసు అనే సినిమా నటించినా పెద్దగా లాభించలేదు. ఆ తర్వాత వరుసగా హీరోయిన్ గా సినిమాలు చేసినా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.  ప్రస్తుతం నిర్మాణ రంగంలో బిజీగా ఉన్న నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో హీరోగా సంగీత శోభన్ నటిస్తున్నాడు. ఇటీవలే ప్రారంభం అయ్యింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు