Rajinikanth Coolie trailer poster
రజనీకాంత్ కూలీ సినిమా ట్రైలర్ విడుదలైంది. హార్బర్ లో కూలీగా వున్న దేవ (రజనీకాంత్) అక్కడే సమాజానికి తెలీయకుండా ఏదో జరుగుతుందని కోణంలో సాగుతుంది. 14,410 మంది కూలీల్లో నాకు కావాల్సింది ఒక్క కూలీ అంటూ.. వారితో పనిచేయించుకునే వాడు మైక్ లో అరవడంతో ఆ తర్వాత జరిగే సన్నివేశాలు ఓ యుద్ధాన్ని తలపిస్తాయి. అదేమిటో పూర్తిగా తెలియాలంటే ఆగస్టు 14వరకు ఆగాల్సిందే అంటున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.