కాంగ్రెస్ పార్టీ విశాఖ అభ్యర్థిగా సినీ నిర్మాత!!

వరుణ్

బుధవారం, 10 ఏప్రియల్ 2024 (10:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించింది. ఇందులో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సినీ నిర్మాతను బరిలోకి దించింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తాజాగా విడుదల చేసిన జాబితాలో సినీ నిర్మాత పులుసు సత్యనారాయణ అలియాస్ సత్యారెడ్డి పేరును ప్రకటించింది. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన ఓ సినీ నిర్మాత. విశాఖపట్టణంలో స్థిరపడ్డారు. గతంలో తెలుగుసేన అనే పార్టీని స్థాపించారు. ఆ తర్వాత ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. 
 
ఇప్పటివరకు ఆయన ఉద్యమ నేపథ్యం కలిగిన 53 చిత్రాలను నిర్మించారు. విశాఖ ఉక్కు నిర్వాసితులతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కూడా ధర్మాన నిర్వహించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆయన స్వీయ దర్శకత్వంలో ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రాన్ని కూడా నిర్మించారు. అందులో ఆయన స్టీల్ ప్లాంట్ ఉద్యమ నాయకుడి పాత్రను పోషించారు. ఈ సినిమాలో ప్రజా గాయకుడు, దివంగత గద్దర్ కూడా నటించారు. 
 
సార్వత్రిక సమరం : మరికొందరు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకేసారి జరుగనున్నాయి. మే 13వ తేదీన జరిగే ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమతమ అభ్యర్థులను ప్రటించాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం దశలవారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరికొందరు అభ్యర్థులతో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో ఆరుగురు లోక్‌సభ, 12 మంది అసెంబ్లీ అభ్యర్థులు కూడా ఉన్నారు. తాజాగా వెల్లడించిన అభ్యర్థుల జాబితాలో పేర్కొన్న అభ్యర్థుల వివరాలను పరిశీలిస్తే...
 
లోక్‍‌సభ అభ్యర్థులు... 
విశాఖపట్టణం - పలుసు సత్యనారాయణ రెడ్డి
అనకాపల్లి - వేగి వెంకటేశ్
ఏలూరు - కావూరి లావణ్య
నరసరావుపేట - గర్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ 
నెల్లూరు - కొప్పుల రాజు
తిరుపతి ఎస్సీ - డాక్టర్ చింతా మోహన్ 
 
అసెంబ్లీ అభ్యర్థులు..
టెక్కిలి - కిల్లి కృపారాణి
భీమిలి - అద్దాల వెంకట వర్మరాజు
విశాఖపట్టణం సౌత్ - వాసుపల్లి సంతోశ్
గాజువాక - లక్కరాజు రామారావు
అరకు లోయ ఎస్టీ - శెట్టి గంగాధర స్వామి
నర్సీపట్నం - రూతల శ్రీరామమూర్తి 
గోపాలపురం ఎస్సీ - సోడదాసి మార్టిన్ లూథర్
యర్రగొండపాలె ఎస్సీ - డాక్టర్ బూదల అజితారావు 
పర్చూరు - నల్లగొర్ల శివ శ్రీలక్ష్మి జ్యోతి
సంతనూతలపాడు ఎస్సీ - పాలపర్తి విజేశ్ రాజ్
గంగాధర నెల్లూరు ఎస్సీ - డి. రమేశ్ బాబు
పూతలపట్టు ఎస్సీ - ఎంఎస్ బాబు
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు