జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి తన వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు హెలికాఫ్టర్‌లో అనకాపల్లి డైట్ కాలేజీ సమీపంలోని ఓ ప్రైవేట్ ల్ ఔట్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రింగురోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం కూడలి, చేపలబజారు, చిన్న నాలుగు రోడ్ల కూడలి, కన్యకాపరమేశ్వరి జంక్షన్, వేల్పుల వీధి మీదుగా నెహ్రూ చౌక జంక్షన్ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు.
నాలుగు గంటలకు పైగా నెహ్రూ చౌక్ కూడలిలో వారాహి వాహనం పైనుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. ఆయనకు మద్దతుగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. సోమవారం యలమంచిలో యాత్ర నిర్వహిస్తారు. మంగళవారం నాడు పిఠాపురంలో జరిగే ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొని, నియోజకవర్గ ప్రజలతో కలిసి ఆయన ఉగాది వేడుకలను జరుపుకుంటారు.