కేసీఆర్ రాష్ట్రాన్ని "గాలి"లా దోచుకు తింటున్నారు: చంద్రబాబు

శనివారం, 29 అక్టోబరు 2011 (16:17 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనకు బినామీ ఆస్తులున్నాయని నిరూపిస్తే వారికి ఆ ఆస్తులను రాసివ్వడానికి సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు సవాలు విసిరారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు.

వైఎస్సార్, గాలి జనార్ధన్ రెడ్డి తరహాలో కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. కేసీఆర్ మాటలు చూస్తుంటే బాధేస్తుందని అయినా ప్రజల కోసమే భరిస్తున్నానన్నారు. తనకు బినామీ ఆస్తులు ఉన్నట్లు నిరూపిస్తే తన ఆస్తులు వారికే రాసిస్తానన్నారు.

తన ఆస్తులు ప్రకటించిన తర్వాత కొందరు దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఉచితంగా తొమ్మిది గంటల విద్యుత్, ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని చంద్రబాబు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి